: బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం... సభ నుంచి వాకౌట్


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. మతపరమైన రిజర్వేషన్ల అంశం ఈనాటి సభను కుదిపేసింది. ఈ క్రమంలో, బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ సందర్భంగా, ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశ ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ధోరణి మంచిది కాదని అన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలే కాని, సస్పెండ్ చేయకూడదని చెప్పారు. ధర్నా చౌక్ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టే వారని... ధర్నా చౌక్ లేకపోవడంతోనే వారు అసెంబ్లీలో ఆందోళన చేశారని అన్నారు. ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని... తామంతా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

  • Loading...

More Telugu News