: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్!


తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ రోజు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా... స్పీకర్ ఆమోదించారు. దీంతో, బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన వారిలో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాజా సింగ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లు ఉన్నారు. 

  • Loading...

More Telugu News