: జగన్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది: ఎంపీ రాయపాటి


ప్రతిపక్ష నేత జగన్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సబబుగా లేదని అన్నారు. జగన్ తీరుతో ఆయన సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారని విమర్శించారు. కులాలు, మతాలకు అతీతంగా పార్టీలు వ్యవహరించాలని, ప్రతిపక్షం చాలా నిర్మాణాత్మకంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. అభివృద్ధిని అడ్డుకుంటే నష్టపోయేది చంద్రబాబు కాదని.. రాష్ట్ర ప్రజలని రాయపాటి అన్నారు.

  • Loading...

More Telugu News