: అలా మాట్లాడటం నా తప్పే.. మురళీమోహన్ కి క్షమాపణ చెబుతున్నా: శివాజీ రాజా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఇటీవలే నటుడు శివాజీరాజా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పలు విషయాలను పంచుకున్నాడు. గతంలో జరిగిన ‘మా' ఎలక్షన్ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గెలిచిన సందర్భంగా తాను ఆ ఓటమి జయసుధది కాదని, మురళీ మోహన్ దని అన్నానని, అయితే, అలా మాట్లాడటం తన తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. ఈ విషయంలో మురళీ మోహన్‌కి క్షమాపణ చెబుతున్నానని చెప్పారు.
తాను అనుభవించిన ఓ భయానక అనుభవం గురించి శివాజీరాజా చెబుతూ... గతంలో తాను ప్రయాణిస్తోన్న కారు ఘోర ప్రమాదానికి గురయిందని, అయితే భగవంతుడి దయ వల్ల తాను బ్రతికి బయట పడ్డానని అన్నారు ఆ ప్రమాదంలో తమ డ్రైవర్ రెండు కళ్లు ఊడిపోయి కిందపడ్డాయని, తనకు అదో భయానక అనుభవం అని చెప్పారు.