: ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం: తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి


తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యా శాఖకు ఈ సారి బడ్జెట్ లో రూ.12,075 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు వేల పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యా బోధన ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 21 నుంచే వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే జూన్ నాటికి 5,600 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News