: జగన్ చొక్కాపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి చమక్కు!
ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన సమయంలో లాబీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో సరదాగా మాట్లాడారు. ఈ రోజు గోరంట్ల, వైసీపీ అధినేత జగన్ దాదాపు ఒకేలాంటి చొక్కాలు వేసుకొని వచ్చారు. దీంతో, 'ఏంటి సార్, మీరిద్దరూ ఒకేలాంటి చొక్కాలు వేసుకొని వచ్చారు?' అంటూ గోరంట్లను మీడియా ప్రతినిధులు అడిగారు. దీనికి సమాధానంగా... జగన్ అన్నీ బ్రాండెడ్ చొక్కాలు వేస్తారని... తాను మాత్రం డిస్కౌంట్ సేల్స్ లోనే దుస్తులు కొంటానని చెప్పారు. బ్రాండెడ్ షర్టులకు పెద్దగా గిరాకీ ఉండదని... డిస్కౌంట్ సేల్స్ నే ప్రజలు ఆదరిస్తారని చమత్కరించారు.