: ఈ రోజు రూ.350 తగ్గిన బంగారం ధర


కొన్ని రోజులుగా పసిడి ధర పైకి ఎగబాకుతూ మ‌ళ్లీ కిందకు ప‌డుతూ వ‌స్తోంది. నిన్న అంత‌ర్జాతీయ‌ మార్కెట్లో పది గ్రాముల ప‌సిడి ధర రూ.300 పెరిగి రూ.29,350కి చేరిన విష‌యం తెలిసిందే. అయితే ఈ రోజు బంగారం ధ‌ర ప‌ది గ్రాముల‌కు రూ.350 త‌గ్గి రూ.29,000గా న‌మోదైంది. అంతర్జాతీయంగా ఈ రోజు నెల‌కొన్న‌ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డ‌మే బంగారం ధ‌ర త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు. అలాగే, పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నించింది. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి రూ.200 తగ్గి రూ.41,250గా న‌మోదైంది.

  • Loading...

More Telugu News