: కోహ్లీకి సారీ అన్న పదం పలకడం రాదేమో!: ఎద్దేవా చేసిన సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్
క్రికెట్ ఆస్ట్రేలియా తీరు గురివింద గింజను తలపిస్తోంది. తమ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ ఆ దేశ బోర్డు చీఫ్ రంగంలోకి దిగడం విశేషం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారీ అన్న పదమే తెలియదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ఎద్దేవా చేశారు. అసలు విరాట్ కోహ్లికి 'సారీ' అనే పదాన్ని ఉచ్చరించడం తెలియదేమో అంటూ తన అసహనాన్ని బయపెట్టాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను చీటర్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన సదర్లాండ్, సారీ అన్న పదం ఉందన్న విషయం తెలియదని ఎద్దేవా చేశాడు. దీనిపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఛీటర్ ను ఛీటర్ అని అనక ఇంకేమంటారని ప్రశ్నిస్తున్నారు.