: రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్... ప్రైమ్ సభ్యత్వం ఉచితం
ఉచిత డేటా, కాల్స్ అందిస్తూ ఇతర టెలికం సంస్థలకు కునుకులేకుండా చేసిన రిలయన్స్ జియో, మరో బంపర్ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఉచితంగా డేటా, కాల్స్ వాడుకునే కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండగా, జియో ప్రైమ్ సభ్యత్వాన్ని రూ. 99కి తీసుకుని, ఓ ప్లాన్ ఎంచుకుని ఉచిత కాల్స్ అందుకోవచ్చని గతంలో ప్రకటించిన సంస్థ ఇప్పుడు జియో ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగానే ఇస్తామని వెల్లడించింది. మార్చి 2018 వరకూ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా వాడుకోవచ్చని, ఆపై కూడా జియో మనీ స్పెషల్ ఆఫర్ ను కొనసాగిస్తూ ఉంటే ప్రైమ్ సభ్యత్వం ఉచితమని పేర్కొంది. ఇది పరిమితకాల ఆఫర్ అని, జియో డాట్ కామ్ లేదా మైజియో యాప్ ద్వారా జియో ప్లాన్ రీచార్జ్ చేయించుకోవాల్సి వుంటుందని, ఆపై రూ. 50 జియో మనీ యాప్ లో క్రెడిట్ చేస్తామని, దీన్ని జూన్ 30, 2017లోగా రూ. 303 విలువైన రీచార్జ్ పై వాడుకోవచ్చని, ఏ కస్టమర్ అయినా 5 సార్లు ఈ తరహా లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఇవ్వదలిచామని వెల్లడించింది.