: కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కాటమరాయుడు నిర్మాత శరత్ మరార్


'కాటమరాయుడా... కదిరి నరసింహుడా' అంటూ 'అత్తారింటికి దారేది' సినిమాలో పాట పాడిన పవన్ కల్యాణ్... ఇప్పుడు 'కాటమరాయుడు' పేరుతో రూపొందిన సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని కదిరిలో గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 'కాటమరాయుడు' సినిమా నిర్మాత శరత్ మరార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు సర్వం సిద్ధమైందని తెలిపారు. ఈ సినిమాను అభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News