: డాక్టర్ హత్య: సోదరిని మోసం చేసినందుకే హతమార్చానన్న బావమరిది!


హైదరాబాదులోని మల్లేపల్లి ప్రాంతానికి చెందిన అజీమ్‌ హుస్సేన్‌ (35) స్థానికంగా ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ గా పనిచేస్తున్నాడు. 18 ఏళ్ల క్రితం అతడి సోదరికి కార్డియాలజిస్ట్‌ మిరాజ్‌ తో వివాహం జరిగింది. అప్పటికే పెళ్లయిన డాక్టర్‌ మిరాజ్‌ మొదట భార్య నుంచి విడాకులు పొందాడు. ప్రస్తుతం వారికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలలుగా వారి మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది.

దీంతో రెండో భార్యకు తెలియకుండా ఇటీవల మిరాజ్‌ మరో యువతిని మూడో వివాహం చేసుకున్నాడు. దీంతో వారి మధ్య వివాదం మరింత పెరిగిపెద్దదైంది. పర్యవసానంగా ఆమె పుట్టింటికి చేరుకుంది. దీంతో అజీమ్ హుస్సేన్ మల్లేపల్లిలోని బావ మిరాజ్ ఆసుపత్రికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అక్కడ మాటమాట పెరగడంతో విసురుగా బయటకు వచ్చిన అజీమ్ హుస్సేన్, ఓ ఆయుధంతో తిరిగి ఆసుపత్రికి వెళ్లి మిరాజ్ ను హతమార్చాడు. దీంతో మిరాజ్ హత్యకు గురికాగా, అజీమ్ హుస్సేన్ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దీంతో నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News