: ఆసీస్ మీడియాను కోహ్లీ పట్టించుకోకపోతే సరి!: క్లార్క్ సలహా
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. క్లార్క్ కెప్టెన్ గా ఉండగా, అతని స్నేహితుడు ఫిల్ హ్యూస్ తలకు బంతి బలంగా తగలడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కోహ్లీకి సంబంధం లేకపోయినా మానవతా విలువలతో మ్యాచ్ ను వాయిదా వేయించేందుకు సహకరించాడు. దీంతో కోహ్లీ అంటే క్లార్క్ అభిమానం పెంచుకున్నాడు. ఆ నాటి ఘటనను తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని, కోహ్లీని అభిమానిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. గతంలో చెప్పినట్టే ఆస్ట్రేలియా మీడియా మొత్తం కోహ్లీని విమర్శల్లో ముంచెత్తుతుంటే... ఆసీస్ మీడియాను పట్టించుకోవద్దని కోహ్లీకి క్లార్క్ సూచించాడు. కోహ్లీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్న ఆసీస్ జర్నలిస్టులను కోహ్లీ పట్టించుకోకపోవడమే బెస్టు అన్నాడు.