: ఉత్తరప్రదేశ్ లో మంత్రులకు శాఖల కేటాయింపు.. హోం శాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం!
తనకు రాష్ట్ర హోం శాఖ కావాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య పట్టుబట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు జరిగిన మంత్రుల శాఖల కేటాయింపులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హోం శాఖను తన వద్దే ఉంచుకొని, మౌర్యకు ప్రజా పనుల శాఖ ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మకు విద్యాశాఖ కేటాయించారు. ఇక మైనారిటీ వ్యవహారాల శాఖను మొహసిన్ రజాకు, వ్యవసాయ శాఖను సూర్యప్రతాప్ సాహికి, ఆర్థిక శాఖను రాజేశ్ అగర్వాల్‌కు, ఆరోగ్య శాఖను సిద్ధార్థ్‌నాథ్‌కు, మహిళా సంక్షేమ శాఖను స్వాతీ సింగ్‌కు, సెకండరీ ఎడ్యుకేషన్ శాఖను రీటా బహుగుణ జోషికి కేటాయించారు.