: ఈ రోజు మరింత పెరిగిన పసిడి ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.29,350కి చేరింది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతోనే పసిడి ధరలు పైకి ఎగిసాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర కూడా మరో 550 రూపాయలు పెరిగి రూ.41,500గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికమవడంతో ధరలు పెరిగిపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సింగపూర్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 0.25శాతం పెరిగి 1,247.30 డాలర్లగా నమోదైంది. ఔన్సు వెండి ధర 0.20 శాతం పెరిగి 17.55 డాలర్లగా ఉంది.