: శివాలయంలో నరేంద్ర మోదీ విగ్రహానికి పూజలు!
తాము అమితంగా ఇష్టపడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా వాసులు పూజలు జరిపారు. అందుకోసం తమ ప్రాంతంలోని ఓ శివాలయంలో మోదీ విగ్రహం పెట్టి, పూల దండలు వేశారు. అనంతరం అంతా అక్కడ కూర్చొని దేవుడిని పూజిస్తున్నట్లు పూజలు జరిపారు. ఇటీవలే మోదీ హవాతో ఉత్తరప్రదేశ్‌లోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మోదీపై ఉన్న భక్తి వారికి మరింత పెరిగిపోయింది. తాము ఇష్టపడే నాయకుల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తుండడం వంటి ఘటనలు గతంలోనూ ఎన్నో కనిపించాయి. తమిళనాడులో జయలలిత, ఖుష్బూలకు గుడి కట్టి పూజలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సినీనటులు అమితాబచ్చన్, రజనీ కాంత్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు కూడా ఇలాగే వారి అభిమానులు గతంలో పూజలు నిర్వహించారు.