: మరి కొన్ని రోజుల్లో పెళ్లి... ఇంతలో యాసిడ్ దాడికి గురైన యువతి!


ఇటీవ‌లే నిశ్చితార్థం జరిగిన ఓ అమ్మాయికి, మరికొన్ని రోజుల్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండగా దారుణం చోటుచేసుకుంది. ఆ యువతిపై ప‌లువురు దుండగులు యాసిడ్‌ దాడి చేసి క‌ల‌క‌లం రేపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ‌ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. ఘజియాబాద్‌కు చెందిన గులిస్తా(21) రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు ఆ దారుణానికి పాల్ప‌డ్డార‌ని అన్నారు. ఆమె ప్రస్తుతం తీవ్ర‌గాయాలతో ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ప‌లువురు దుండ‌గులు లీటర్‌ బాటిల్‌లో యాసిడ్‌ తెచ్చి ఆమెపై పోశార‌ని, ఆ బాటిల్ త‌మ‌కు లభించింద‌ని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు. ఆ అమ్మాయి కోలుకుంటే వాంగ్మూలం తీసుకుంటామ‌ని చెప్పారు. ఆ యువ‌తితో లేక‌ ఆమె కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్నవారే ఈ దారుణానికి పాల్ప‌డ్డారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News