: ఉత్తరప్రదేశ్ లో మాంసం దుకాణాలను తగులబెట్టిన దుండగులు!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత యోగి ఆదిత్య నాథ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆ రాష్ట్రంలోని హత్రాస్‌లో నిన్న సాయంత్రం పలువురు దుండగులు మాంసం దుకాణాలను తగులబెట్టారు. ఆ దుకాణాలకు సరైన అనుమతులు లేకపోవడంతో తాము అంతకు ముందు రోజే వాటిని మూయించామని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సమాచారం. ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.