: మాజీ సీఎం కృష్ణ నిర్ణయం మమ్మల్ని చాలా భాధకు గురి చేసింది... ఆయన తప్పు చేస్తున్నారు: మల్లికార్జున ఖర్గే


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరబోతుండటాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయం తమను ఎంతో బాధిస్తోందని... ఆయన చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అన్నీ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పదవులు, గౌరవాలు పొందిన అతి కొద్ది మంది నేతల్లో ఆయన ఒకరని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా కృష్ణకు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవులను కట్టబెట్టిందని గుర్తు చేశారు. జీవితంలో ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్న వయసులో... ఇప్పటి వరకు నమ్మిన సిద్ధాంతాలను వదులుకోవడం మంచిది కాదని అన్నారు. 50 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతాలను ఇప్పుడు ఎందుకు మార్చుకుంటున్నారో... బీజేపీలో ఎందుకు చేరుతున్నారో తమకు అర్థం కావడం లేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News