: అసలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి అడ్డుపడడం ఏమిటి?: మంత్రులు కామినేని, అచ్చెన్నాయుడు మండిపాటు
జలదినోత్సవంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెబుతున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి అడ్డుపడడం ఏంటని ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం మాట్లాడిన తరువాత వైసీపీ నేతలు మాట్లాడవచ్చని అన్నారు. ప్రకటన చేసేటప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదని అన్నారు. సభను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటికే వైసీపీ సభ్యులు ఎంతో సమయం వృథా చేశారని అన్నారు. సభలో ఇటువంటి ప్రవర్తన సరికాదని అన్నారు. వారి ధోరణి ప్రతిరోజు ఇలాగే ఉందని అన్నారు.