: రియాల్టీ డ్యాన్స్ షోలో భార్యతో కలసి పాల్గొననున్న యువరాజ్
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తన భార్య హాజెల్ కీచ్ తో కలసి రియాల్టీ డ్యాన్స్ షో 'నచ్ బలియే'లో పాల్గొనబోతున్నాడు. త్వరలో జరగనున్న సీజన్-8లో వీరిద్దరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు ఈ మ్యాచ్ లతో యువీ బిజీగా ఉండబోతున్నాడు. 'నచ్ బలియే' కొత్త సీజన్ మొదలయ్యే నాటికి ఐపీఎల్ ముగుస్తుంది. దీంతో, ఆ కార్యక్రమంలో తన భార్యతో కలసి యూవీ చిందులు వేయనున్నాడు. యువీ జంట రాకతో తమ కార్యక్రమానికి ఎక్స్ ట్రా గ్లామర్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.