: బౌలింగ్ మిషన్‌తో ధర్మశాలకు వెళుతున్నా: విమానంలో విరాట్ కోహ్లీ సెల్ఫీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు ఈ నెల 25 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ధర్మశాలకు బయలుదేరింది. ఈ సందర్భంగా తాము ప్రయాణిస్తోన్న విమానంలో సెల్ఫీ తీసుకున్న కోహ్లీ దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ 'బౌలింగ్ మిషన్ రవీంద్ర జడేజాతో ధర్మశాలకు వెళుతున్నా'నని పేర్కొన్నాడు. ఆ సెల్ఫీలో కోహ్లీ వెనుక జడేజా ఉన్నాడు. సిరీస్‌లో మొదటి టెస్టులో ఆసీస్ గెలవగా, రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. ఇక మూడో టెస్టు డ్రాగా నిలవడంతో సిరీస్ ఎవరిదో తేల్చే నాలుగో టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Off to Dharamshala for the last one. With the bowling machine ✌️