: షమీ వైపు మొగ్గు చూపుతున్న కోహ్లీ!
ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి టెస్టులో పేసర్ మొహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ... తిరిగి తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో నిన్న తమిళనాడుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా షమీ సత్తా చాటాడు. పశ్చిమబెంగాల్ తరపున ఆడిన షమీ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో, నాలుగో టెస్టులో షమీని తీసుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇరు జట్లు 1-1తో సమానంగా ఉండటంతో... చివరి టెస్టు విజయం కీలకం కానుంది. దీంతో, షమీ జట్టులో ఉంటే బౌలింగ్ బలం పెరుగుతుందని కోహ్లీ భావిస్తున్నాడు. ఒకవేళ షమీ తుది జట్టులోకి వస్తే... ఇషాంత్, ఉమేష్ యాదవ్ లలో ఒకరికి విశ్రాంతిని కల్పించే అవకాశం ఉంది.