: మరింత మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వస్తామంటున్నారు: సీఎం రమేష్


అతి త్వరలో మరింత మంది వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, చాలామంది వైకాపా శాసన, పార్లమెంట్ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని, కడప ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడంతో సీమలో తెలుగుదేశం బలం మరింతగా పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన సూచనతోనే సామాన్యుడైన బీటెక్ రవిని బరిలోకి దింపి గెలిపించామని, ఇది చంద్రబాబు, లోకేష్ లకు తామందించిన ఉగాది కానుకని అభివర్ణించారు. త్వరలోనే వైకాపా మొత్తం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పిన రమేష్, తమ పార్టీలో చేరాలని భావించే అందరికీ స్వాగతం పలుకుతామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News