: కేటీఆర్ ను కలిసిన వీవీఎస్ లక్ష్మణ్!


మాజీ క్రికెటర్, స్టయిలిష్ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న వీవీఎస్ లక్ష్మణ్, ఈ ఉదయం తెలంగాణ మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ, లక్ష్మణ్ తో మాట్లాడుతున్న చిత్రాలను పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము చర్చించామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనపై లక్ష్మణ్ సలహాలు తీసుకున్నట్టు వెల్లడించారు. తన మణికట్టుతో మాయచేసే బ్యాట్స్ మెన్ ను కలుసుకున్నానని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News