: పార్లమెంటుకు వచ్చిన యూపీ సీఎం.. అనంతరం మోదీతో భేటీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ రోజు పార్లమెంటుకు వచ్చారు. ఆయనకు పార్లమెంటులో పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు.
The Chief Minister of Uttar Pradesh, Shri @yogi_adityanath met PM Shri @narendramodi. @CMOfficeUP pic.twitter.com/GhFuiEH7uA
— PMO India (@PMOIndia) March 21, 2017