: నేను వార్నింగ్ ఇస్తున్నా.. ఇది మంచి పద్ధతి కాదు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘నేను వార్నింగ్ ఇస్తున్నా.. ఇది మంచి పద్ధతి కాదు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అన్నారు.
తాను ఎంతో ఓపికగా ఉంటాను కానీ వారు మాట్లాడే మాటలకి ఒక్కోసారి విసుగు, కోపం వస్తాయని అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని అన్నారు. వైసీపీ దివాళా కోరు పార్టీగా తయారైందని అన్నారు. వీరి ప్రవర్తన మంచి ప్రవర్తన కాదని, ఇలాంటి ప్రవర్తన ఉండడం వల్ల ప్రజల్లో పరపతి పెరుగుతుందని వారు అనుకుంటున్నారని, కానీ దీని వల్ల వారి పరపతి మరింత దిగజారి పోతుందని అన్నారు. స్పీకర్ అంటే కూడా వారికి గౌరవం లేదని చంద్రబాబు అన్నారు.