: లేడీస్ హాస్టల్ లో ఉంటున్న మాజీ ఉద్యోగిని నగ్న చిత్రాలు సేకరించిన హైమా కన్సల్టెన్సీ ఎండీ... కటకటాల వెనక్కు!


హైదరాబాద్ లోని కూకట్ పల్లి లేడీస్ హాస్టల్ లో దారుణం జరిగింది. తన వద్ద పనిచేసి మానేసిన ఓ యువతిని లొంగదీసుకునేందుకు, ఆమె రూమ్ మేట్ చేతనే నగ్న దృశ్యాలు, వీడియోలు తీయించి, వాటిని చూపి బెదిరిస్తున్న హైమా కన్సల్టెన్సీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు ఆలపాటి శివయ్య, ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ సీఐ పి.రవీందర్‌ రెడ్డి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించారు.

ఇక్కడి పూజిత ఉమెన్స్ డీలక్స్ హాస్టల్ లో పొద్దుటూరుకు చెందిన 32 ఏళ్ల యువతి, బాధితురాలు రెండేళ్లుగా కలిసి ఉంటున్నారు. వీరు గతంలో హైమా కన్సల్టెన్సీ సంస్థలో కలిసి పనిచేశారు. తన వద్ద పనిచేస్తున్న సమయంలో బాధితురాలిని వేధింపులకు గురి చేసిన శివయ్య, ఆమె మానేసిన తరువాత, తన కోరిక తీర్చుకునేందుకు ఆమె స్నేహితురాలు, ప్రస్తుతం తన వద్దే పనిచేస్తున్న యువతి సాయం కోరాడు. దీంతో ఆ యువతి, బాధితురాలు దుస్తులు మార్చుకుంటుంటే వీడియో, ఫోటోలు తీసి శివయ్యకు పంపింది.

ఆపై ఆ దుర్మార్గుడు వాటిని నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి అప్ లోడ్ చేశాడు. వీటిని చూసిన బాధితురాలు, ఈ పని తన రూమ్ మేటే చేసి వుండవచ్చన్న అనుమానంతో ఆమె సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లను పరిశీలించింది. వాటిల్లో తన దృశ్యాలు, వీడియోలు కనిపించడంతో అవాక్కై, సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసును విచారించిన క్రైమ్ పోలీసులు శివయ్యను, ఫోటోలు తీసిన యువతిని అరెస్ట్ చేసి పదహారో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, ఆపై జైలుకు తరలించారు. హాస్టల్ లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం ఎంతో మంది మహిళా ఉద్యోగినులను కలవరపరిచింది.

  • Loading...

More Telugu News