: శరీరంపై పుట్టుమచ్చలు చెరిపేసిన ధనుష్... తేల్చిన వైద్యులు, చిక్కులు తప్పవంటున్న న్యాయ నిపుణులు


తమిళ హీరో ధనుష్, తన శరీరంపై పుట్టుమచ్చలను చెరిపేశారని, అందుకు అందుబాటులోని ఆధునిక వైద్య చికిత్సలను ఉపయోగించుకున్నాడని వైద్యులు కోర్టుకు సంచలన నివేదిక ఇచ్చారు. ధనుష్ తమ కుమారుడేనని, తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన కదిరేశన్, మీనాక్షీ దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం, ధనుష్ పుట్టమచ్చలను పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ఆయన్ను పరీక్షించిన వైద్యులు లేజర్ చికిత్స విధానంలో ఆయన తన శరీరంపై ఉన్న మచ్చలను తొలగించారని నివేదిక ఇచ్చింది. దీంతో కదిరేశన్ దంపతుల వాదన నిజమై ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ధనుష్ కు కష్టాలు తప్పక పోవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్యుల రిపోర్టును పరిశీలించిన కోర్టు, తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News