: యూపీ సీఎం ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతోంది!
ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. యోగి సీఎం కాకముందు, అయిన తర్వాత ఆయన్ని ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారి సంఖ్యలో చాలా మార్పు చోటుచేసుకుంది. గత శనివారం వరకు ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 1,47,000. అయితే, యోగి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశాక ఆ సంఖ్య 2,19,000 కు చేరింది. తాజాగా, ఆ సంఖ్య 2,34,000కు పెరిగింది. అంటే.. కేవలం రెండు రోజుల్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 72,000 కు పెరిగింది. అంతేకాదు, గతంలో 28 ట్విట్టర్ ఖాతాలనే అనుసరించిన యోగి, సీఎం అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీస్, యూపీ ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వంటి ఖాతాలను కూడా జత చేసుకున్నారు.