: కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతాయి: చంద్రబాబు
కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసత్యాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తాము అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతామని ఉద్ఘాటించారు. కాపులకు ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నామని అన్నారు. జగన్ చెబుతున్నవే అబద్ధాలని అన్నారు. జగన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విపక్ష నేతల తీరు బాగోలేదని అన్నారు. తాము త్వరలోనే విపక్ష నేతల బండారాలను బయటపెడతానని అన్నారు. మరోవైపు సభలో గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.