: సామూహిక సెలవులో 4,000 మంది వైద్య సిబ్బంది


4,000 మంది వైద్య సిబ్బంది సామూహిక సెలవులో ఉండడంతో మహారాష్ట్రలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర ప్రభుత్వ వైద్యులు సామూహిక సెలవును స్వీకరించారు. ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో మార్చి 14న వైద్యుడిపై రోగి బంధువులు దాడి చేశారు. దీంతో వెంటనే ప్రభుత్వం వైద్యుడిపై దాడికి దిగిన 9 మందిని అదుపులోకి తీసుకుంది. అయితే వారిని అరెస్టు చేసి, చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ వైద్యులు మూకుమ్మడి సెలవు నిర్ణయం తీసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప... తాము నిరసన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. వైద్యుల నిర్ణయంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News