: అవునా? బాలసుబ్రహ్మణ్యానికి ఇళయరాజా నోటీసులు పంపారా?: ఆశ్చర్యపోయిన వెంకయ్యనాయుడు


ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమెరికాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 'ఎస్పీబీ-50' సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ఈ టూర్ లో ఉన్న సందర్భంగా ఇళయరాజా కంపోజ్ చేసిన పలు పాటలను పాడి వినిపించారు. దీనిపట్ల ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు పంపారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం తన ప్రియ మిత్రుడైన ఇళయరాజాకు అసౌకర్యం కలిగేలా పాటలు పాడబోమని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ వివాదం తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News