: షారుఖ్ ని పెళ్లి చేసుకుంటా....ఐశ్వర్యారాయ్, సిద్ధార్థ్ మల్హోత్రాని చంపేస్తా: కరణ్ జొహార్
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ పలు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. కరణ్ జొహార్ వ్యవహారశైలిని బాలీవుడ్ లో పలువురు సరదాగా విమర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంక్లేవ్ లో మాట్లాడిన సందర్భంగా మీడియా పలు సరదా ప్రశ్నలు అడిగింది. దానికి అంతే సరదాగా సమాధానం చెప్పిన కరణ్ ఆకట్టుకున్నాడు.
మీరు ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? అని విలేకరి అడుగగా తన స్నేహితుడు షారుఖ్ ఖాన్ ని వివాహం చేసుకుంటానని కరణ్ సమాధానమిచ్చాడు. షారుఖ్ బంగ్లా బాగుంటుందని, దాని కోసం షారుఖ్ ని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అలాగే ఐశ్వర్యా రాయ్ ని, సిద్ధార్థ్ మల్హోత్రాను చంపేస్తానని అన్నాడు. అయితే అందుకు కారణాలు మాత్రం చెప్పనని అన్నాడు. కాగా, అలియాను కూతురుగా భావించే కరణ్ జొహార్... అలియా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను చంపేస్తాననడంలో ఆశ్చర్యం ఏముంది? అని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.