: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పట్టిస్తే రివార్డ్ ఇస్తానంటున్న కాంగ్రెస్ నేత!


ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తెలిసిందే. ఈ పరాజయానికి కారణం తమ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరేనని కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ సింగ్ భావించారు. అలా భావించడమే తరువాయి, ప్రశాంత్ కిషోర్ ను పట్టిస్తే రూ.5 లక్షల నజరానా ఇస్తానంటూ ప్రకటించాడు. లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ నూ ఏర్పాటు చేశాడు. అయితే, ఈ పోస్టర్ ను చూసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ వెంటనే స్పందించారు. వెంటనే దానిని తొలగించమని తన కార్యకర్తలను ఆదేశించారు. కాగ, ఈ ఘటనకు కారణమైన రాజేష్ సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News