: మంత్రులంతా ఆస్తుల వివరాలు చెప్పండి.. యూపీ సీఎం తొలి ఆదేశం!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ తన పనిని ప్రారంభించారు. పరిపాలనలో తనదైన ముద్రను వేసేందుకు ఆయన తన కార్యచరణను ప్రారంభించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 15 రోజుల్లోగా మంత్రులంతా వారి స్థిరాస్తులు, చరాస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించాలంటూ సీఎంగా తన తొలి ఆదేశాన్ని జారీ చేశారు. అంతకు ముందు ఆయన తన మంత్రివర్గంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అవినీతి నిర్మూలనే తన ప్రభుత్వం ప్రాధాన్యత అని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని... అభివృద్ధి కుంటుబడిందని అన్నారు. శాంతిభద్రతల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, సుసంపన్నం చేసేందుకు అవసరమైన ప్రతి చర్యను తమ ప్రభుత్వం తీసుకుంటుందని యోగి తెలిపారు. 

  • Loading...

More Telugu News