: దుప్పిలను వేటాడిన అధికార పార్టీ నేతలు.. అటవీ అధికారిని గన్ తో బెదిరించి పరార్


తెలంగాణలో కొత్తగా ఏర్పడిన భూపాల్ పల్లి జిల్లాలో అధికార పార్టీ నేతలు దారుణానికి ఒడిగట్టారు. మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లి అడవుల్లో రెండు దుప్పిలను కాల్చి చంపారు. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారని, స్థానిక నేతలతో కలసి దుప్పిలను వేటాడారని చెబుతున్నారు. దుప్పిలను చంపిన విషయాన్ని గమనించిన అటవీశాఖ అధికారి రమేష్, ఇతర సిబ్బందిని గన్ తో బెదిరించి వీరు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే, వేటగాళ్లు తెచ్చుకున్న ఆయుధం, కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News