: పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసిన వర్మ
మెగా హీరోలపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. 'నాకు మొక్కలంటే ప్రేమ' అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ పై వర్మ కామెంట్ చేశాడు. తాను ఎప్పుడూ పవన్ కల్యాణ్ ను దేవుడనే నమ్ముతానని తెలిపాడు. తిరుపతి వెంకన్న, యాదగిరిగుట్ట నరసింహస్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్లనంతా పవన్ కల్యాణ్ తో భర్తీ చేయాలని వర్మ అన్నాడు.