: అందువల్లే జగన్ ను కాదని, చంద్రబాబు వద్దకు చేరా: జేసీ దివాకర్ రెడ్డి


తాను కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన వేళ, వైకాపాలో కాకుండా, తెలుగుదేశం పార్టీలో చేరడానికి గల కారణాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు పొగరు ఎక్కువని, అది ఉండాల్సిన పొగరు కన్నా ఎంతో ఎక్కువని విమర్శించారు. ఆ వైఖరి అత్యంత ప్రమాదం కాబట్టే, తాను ఎన్నికలకు ముందే తెలుగుదేశంలో చేరిపోయానని, ఎంపీగా సీటు గెలవడమే లక్ష్యంగా మాత్రం తెలుగుదేశంలో చేరలేదని స్పష్టం చేశారు. రాయలసీమ రైతులకు సాగు, తాగు నీటిని అందిస్తే, 2019లో సైతం చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, హంద్రీనీవా నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలకూ నీటిని తప్పనిసరిగా అందించగలమన్న నమ్మకం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News