: స్టేజి పైనే సవాల్ విసురుకున్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్!


‘‘నాకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారు. ఆ విషయాన్ని ఓ మంత్రి నాతో చెప్పారు’’ అంటూ ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అక్కసు వెళ్లగక్కారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం  సందర్భంగా మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, మీడియా కావాలనే లేనిపోని కథనాలు రాస్తోందని ఆరోపించారు. శ్రీనివాస్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకుంటున్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు.

అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాకుండా జితేందర్‌రెడ్డే అడ్డుకున్నారని, ఈ విషయాన్ని ఓ మంత్రి తనతో స్వయంగా చెప్పారని ఆరోపించారు. దీంతో స్పందించిన జితేందర్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకున్నట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల  నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మంత్రి పదవి చేపట్టేందుకు తలరాత ఉండాలని, ఎవరో అడ్డుపడితే అది ఆగిపోదంటూ ఆవేశంగా మాట్లాడారు. మంత్రి పదవుల విషయంలో కేసీఆర్ ఒకరు చెబితే వింటారా? అని ప్రశ్నించారు. ‘‘ఏ మంత్రి చెప్పాడో అతడిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్దాం. నేను అడ్డుపడినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని మరోమారు సవాల్ విసిరారు. వ్యవహారం ముదురుతుండడంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.

  • Loading...

More Telugu News