: మా అబ్బాయి నా కన్నా బిజీ!: నారా లోకేశ్


కొడుకు దేవాన్ష్ తన కన్నా చాలా బిజీగా ఉంటాడని నారా లోకేశ్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మా అబ్బాయిని ప్రీ స్కూల్.. మాంటిస్సోరి ట్రైనింగ్ స్కూల్ కు పంపిస్తున్నాము. ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు జిమ్నాస్టిక్స్ చేస్తాడు. 10.30 గంటలకు స్కూల్ కు వెళతాడు. తిరిగొచ్చిన తర్వాత ఒక రోజు సంస్కృత భాష, మరో రోజు చైనీస్ భాష నేర్పిస్తాం. నా కన్నా బిజీ అయిపోయాడు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. మా వాడిని ఇంగ్లీషులో అడిగినా తెలుగులోనే సమాధానం చెబుతాడు. రోజూ పేపర్లు చూసి.. ‘తాత’ ఇడిగో అని చెబుతాడు. అలానే, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో చూసి ‘మోదీ తాత’ అని చెబుతాడు...’ అని తన కొడుకు దేవాన్ష్ గురించి లోకేశ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News