: ఈ ముగ్గురూ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి!
యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఎందుకంటే, యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ ఎంపీ కాగా, పూల్ పూర్ ఎంపీగా కేశవ్ ప్రసాద్ మౌర్య వున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మాత్రం లక్నో మేయర్ గా ఉన్నారు. దీంతో, వీరు ముగ్గురూ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. కాగా, ఈ రోజు మధ్యాహ్నం యూపీ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మరో నలభై మూడు మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు.