: మరో వికెట్ పడకుండా గోడకట్టిన పుజారా, సాహా
రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టు, నాలుగో రోజు లంచ్ విరామ సమయం వరకూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడింది. మూడో రోజు ఆటను 6 వికెట్ల నష్టానికి 360 పరుగుల వద్ద కొనసాగించిన భారత జట్టు, నేడు లంచ్ విరామ సమయానికి ఇంకో వికెట్ కోల్పోకుండా, మరో 75 పరుగులను జోడించింది. ఈ క్రమంలో సాహా సైతం తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 161 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 435 పరుగులు కాగా, పుజారా 164, సాహా 59 పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.