: కమలహాసన్ సోదరుడు చంద్రహాసన్ మృతి
ప్రముఖ దక్షిణాది నటుడు కమలహాసన్ అన్న చంద్రహాసన్ లండన్ లో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ప్రస్తుతం లండన్ లో కుమార్తె వద్ద ఉంటున్న ఆయన, గుండెపోటు కారణంగా ఈ ఉదయం మరణించారు. జనవరి 7న చంద్రహాసన్ భార్య గీతామణి (73) మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఆవేదనలో కూరుకుపోయిన చంద్రహాసన్, మూడు నెలలు గడవక ముందే కన్నుమూయడం గమనార్హం. కాగా, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకాన్ని స్థాపించిన చంద్రహాసన్, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతికి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.