: జయలలిత గురించి శోభన్ బాబును అడిగితే అలా చెప్పేవారు!: వాణీ విశ్వనాథ్
ప్రస్తుతం రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకుంది. ఆయన వద్ద తాను ఓ చిన్న పిల్లలా ఉండేదాన్నని, కలిసినప్పుడల్లా జయలలిత గురించి అడిగేదాన్నని చెప్పుకొచ్చింది. అమె చాలా తెలివైనవారని శోభన్ బాబు చాలా నెమ్మదిగా సమాధానం ఇచ్చేవారని, ఆమె ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉంటారని కూడా తనకు చెప్పారని వెల్లడించింది.
ఆ సమయంలో అలా అడగటం తప్పా? ఒప్పా? అన్నది కూడా తనకు తెలిసేది కాదని చెప్పింది. ఇక ఎన్టీఆర్ తో పరిచయం గురించి చెబుతూ, ఆయనతో కలసి 'సమ్రాట్ అశోక' చిత్రం చేస్తున్నప్పుడు, తొలిసారిగా నన్ను చూసిన వేళ, 'మీరు' అని ఆయన సంబోధించడం చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. ఆయన మర్యాదను తానూ ఒంటబట్టించుకున్నానని, ఎవరినైనా మీరు అనే సంబోధించడం నేర్చుకున్నానని చెబుతోంది.