: ఇకపై ఏపీ మీదుగా... రూటు మార్చుకున్న బెంగళూరు-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్!


బెంగళూరు నుంచి నిజాముద్దీన్ మధ్య నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ ఇకపై ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనుంది. రైలు నంబర్ 22691ని జూలై 1 నుంచి ఏపీ మీదుగా నడిపించనున్నట్టు నైరుతీ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. బెంగళూరు తరువాత ఈ రైలు ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు మీదుగా వెళుతుందని, తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంగా వస్తుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్ రూటును మారుస్తున్నామని, ఇతర రైళ్ల ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని ప్రకటించారు.

  • Loading...

More Telugu News