: ధోనీ మూడు ఫోన్ల చోరీ... రంగంలోకి దిగిన పోలీసులు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన మూడు ఫోన్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ విషయంలో ధోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా జార్ఖండ్ జట్టు తరఫున ధోనీ ఆడుతున్న వేళ, తన జట్టు సహచరులతో కలసి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసిన సమయంలో, అక్కడ అగ్ని ప్రమాదం జరుగగా, సందట్లో సడేమియాలా ఆయన ఫోన్లను దొంగిలించుకుపోయారు. అగ్ని ప్రమాద సమయంలో ఆటగాళ్లను వేరే ప్రాంతానికి తరలించే హడావుడిలో దొంగలు తమ చేతికి పని చెప్పారని ధోనీ ఫిర్యాదు చేశాడు.