: అన్నీ చెబుతారుగానీ, ఆ ఒక్క విషయం ఎందుకు మాట్లాడరు?: రేవంత్ రెడ్డికి టీవీ 9 సూటి ప్రశ్న


నేడు ప్రసారం కానున్న 'ఎన్ కౌంటర్ విత్ మురళీ కృష్ణ' కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పలు కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. "నైతికంగా మీరు చేసిన పని కరెక్టా? కాదా?" అని ఓటుకు నోటు కేసు విషయమై ప్రశ్నించగా, 'ఈ పన్నాగాలు, ఇలాంటివి...' అంటూ సమాధానం ఇచ్చేందుకు రేవంత్ ప్రయత్నించారు. ఈ విషయాలన్నీ మాట్లాడతారుగానీ, 'ఆ ఒక్క విషయం గురించి ఎందుకు మాట్లాడరు?' అన్న ప్రశ్నకు, "ఆ ఒక్క విషయం గురించి మాట్లాడవద్దని కోర్టు చెప్పింది. మీరు వెళ్లి ఎగ్జంప్షన్ తెచ్చుకోండి" అన్నారు. 'టీవీ-9లో ఎన్ కౌంటర్ కోసం నేను మాట్లాడవచ్చు అని అనుమతి తెచ్చుకుంటే... మొత్తం ఫుల్ లెంగ్త్ దీని మీదే మాట్లాడుతా' అని అన్నారు. ఆ కేసులో కేసీఆర్ గురించి మాట్లాడవద్దు, ఆరోపణలు చేయవద్దని కోర్టు చెప్పినందునే తాను మాట్లాడటం లేదని అన్నారు. ఈ కార్యక్రమం నేటి రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News