: కర్రలు, రాళ్లతో కొట్టుకున్న ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు
కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తమకు దొరికిన కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఏబీవీపీ విద్యార్థులను ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు కర్రలతో బాగా బాదేసినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో మొత్తం 15 మంది ఏబీవీపీ విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలోని వర్మ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు రౌడీయిజం చేస్తున్నారని ఏబీవీపీ పూర్వ విద్యార్థులు ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో అక్కడకు చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఐ దాడులకు దిగడంతో ఈ ఘర్షణ చెలరేగింది.