: విమానం ప్రొఫెల్లర్ పడిపోయింది.. దొరికితే తెచ్చివ్వరూ?: సిడ్నీ వాసులను కోరుతున్న ఏవీయేషన్ విభాగం


విమానం ప్రొఫెల్లర్ సిడ్నీలో ఎక్కడో పడిపోయిందని... సిడ్నీ వాసులెవరికైనా దొరికితే తెచ్చివ్వాలని ఆస్ట్రేలియా సివిల్ ఏవియేషన్ విభాగం సేఫ్టీ ప్రతినిధి పీటర్ గిబ్సన్ కోరారు. వివరాల్లోకి వెళ్తే... సాబ్ 340 ఎయిర్ లైనర్ విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయం చేరుకుంటున్న క్రమంలో ఆ విమానం కుడివైపు ఉండే ప్రొఫెల్లర్ (ఫ్యాన్) ఊడిపోయినట్టు విమాన సిబ్బంది గుర్తించారు. ప్రొఫెల్లర్ నుంచి ఇంజన్‌ కి అనుసంధానమై ఉండే కడ్డీ కూడా బయటికి వచ్చింది. దీంతో ప్రొఫెల్లర్‌ ఫ్యాన్‌ సెట్ మొత్తం ఊడిపోయి కిందపడిపోయింది. ఇది అత్యంత అసాధారణంగా జరుగుతుంది. దీంతో విమాన పైలట్ 'పాన్ పాన్ కాల్' చేశారు. విమానం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రమాదకరం కాదని చెప్పే కాల్ ను 'పాన్ పాన్ కాల్' అంటారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పలు సూచనలు చేసి, విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఏవియేషన్ ప్రతినిధి ప్రొఫెల్లర్ పడిపోయిందని, దొరికితే తెచ్చివ్వాలని కోరారు.  

  • Loading...

More Telugu News