: ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా...పుజారా ఒంటరి పోరాటం


టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు టీమిండియా ఆటగాళ్లు రాణించగా, మూడో రోజు భారత్ బ్యాట్స్ మన్ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లను అడ్డుకోగలిగినప్పటికీ స్వదేశంలో చూపాల్సిన ఆటతీరును మాత్రం చూపించలేదు. ఏడేళ్ల తరువాత వరుసగా టాప్ 3 బ్యాట్స్ మన్ మంచి స్కోరు చేసి ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (6), వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (14), ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ (23), ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (3) పేలవంగా ఆడారు. అయితే, సహచరులంతా అవుటవుతున్నప్పటికీ ఛటేశ్వర్ పుజారా (117) మాత్రం సెంచరీతో రాణించి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. పుజారాకు సాహా జతకలిశాడు. దీంతో 116 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 328 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ నాలుగు వికెట్లతో రాణించగా, ఒకీఫ్, హాజెల్ వుడ్ చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News